
స్వరాజ్యం నా జన్మహక్కు..దాన్ని నేను పొంది తీరుతాను అని గర్జించిన ధీరుడు బాలగంగాధర తిలక్
-నేడు అయిన వర్ధంతి సిరా న్యూస్; స్వరాజ్యం నా జన్మహక్కు..దాన్ని నేను పొంది తీరుతాను అని స్వాతంత్ర పోరాటంలో గర్జించిన ధీరుడు లోకమాన్య బాలగంగాధరతిలక్. దేశవ్యాప్తంగా సామాన్యప్రజల్ని భారతజాతీయోద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో బాలగంగాధర తిలక్ సఫలీకృతుడయ్యారు. అందుకే ఆయనను భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూలకారకుడు గా భావిస్తారు.అతను జాతీయోద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించడం తో ఆయనను భారతజాతీయోద్యమ పితగా పేర్కొంటారు.ఇతనికి లోకమాన్య అనే బిరుదు కూడా ఉంది.మహాత్మా గాంధీ అతన్ని "ఆధునిక భారతదేశపు మేకర్" అని పిలిచారు. బాలగంగాధరతిలక్ 1856 జులై 23వ తేదీన మహారాష్ట్ర లోని రత్నగిరిలో జన్మించాడు. తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ సంస్కృత పండితుడు. తల్లి పార్వతీ బాయి ఆధ్యాత్మిక సంపన్నురాలు, బాల్యం లో తిలక్ చాలా చురుకైన విద్యార్థి. ప్రత్యేకించి గణితశాస్త్రంలో ఆయన విశేష ప్రతిభ కనబరచేవాడు. చిన్నప్పటి…
