
గాడిలో బండి సంజయ్…..
సిరా న్యూస్,కరీంనగర్; కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ ముందుకు సాగుతున్నారు. గత ఎన్నికల కంటే అధిక మెజారిటీ కోసం ప్లాన్ చేస్తున్నారు. కరీంనగర్‌లో ఇప్పుడే రాజకీయం వేడెక్కింది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏడు సెగ్మెంట్లలోని పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం తీసుకవచ్చే వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఎంపీ ఎన్నికల నాటికి గ్రౌండ్ లెవల్‌లో పటిష్ట పర్చుకోవాలన్న లక్ష్యంతో సరికొత్త ప్రణాళికలు వేస్తున్నారు. లోకసభ పరిధిలో కేంద్రం నుంచి మంజూరు చేయించిన నిధుల వివరాలను కూడా ప్రజలకు చేరవేయాలని భావిస్తున్నారు. తాజాగా ఏడు సెంగ్మెంట్లలోని పార్టీ శ్రేణులతో కీలక సమావేశం కూడా ఏర్పాటు చేసి క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు.బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎంపీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో పడ్డారు. లోకసభ పరిధిలోని…
