ఆంధ్రప్రదేశ్

పార్టీలో బీసీ జపం

సిరా న్యూస్,విజయవాడ; ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నిక‌ల‌కు గ‌డువు ముంచుకొస్తుంది. ప్రధాన పార్టీల‌న్ని ఓట్ల వేట‌లో ప‌డ్డాయి. కీల‌క‌మైన బీసీ ఓటు బ్యాంకుపై తెలుగుదేశం, వైసీపీ ఫోక‌స్ పెట్టాయి. క్రమంలోనే ఒక అడుగు ముందుకేసిన తెలుగు దేశం పార్టీ జ‌య‌హో బీసీ పేరుతో 40 రోజుల పాటు స‌మావేశాల‌కు సిద్దమైంది. ఇక ఏపీలోని బీసీ కుల‌సంఘాల‌న్ని వైసీపీకి మ‌ద్దతు ప్రక‌టిస్తూ తీర్మానం చేశాయి. ఒక్క వైసీపీనే బీసీల పార్టీ అని ప్రక‌టించాయి.ఏపీలో ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గర‌ప‌డుతున్న కొద్దీ ప్రధాన రాజ‌కీయ పార్టీలు కులాల‌వారీ ఓట్లను ఆకట్టుకునే ప‌నిలో ప‌డ్డాయి. టీడీపీ – వైసీపీ రెండింటిలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే బీసీ ఓటు బ్యాంకు ఎంతో కీల‌కం. ఒక‌ప్పుడు టీడీపీకి అండ‌గా ఉన్న బీసీలంతా గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ బాట ప‌ట్టారు. దీంతో టీడీపీకి ఇబ్బందులు త‌ప్పలేదు.…

Read More
6 Jan 2024, 10:59 amsiranews.in