Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 4 April 2024, 3:34 pmEditor : SIRA NEWS

beeraiah: మంత్రి పొన్నం ప్రభాకర్ కు రుణపడి ఉంటాం

సిరాన్యూస్‌, సైదాపూర్
మంత్రి పొన్నం ప్రభాకర్ కు రుణపడి ఉంటాం
* సోమారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీస బీరయ్య
* కల్వర్టు పనులు ప్రారంభం

మంత్రి పొన్నం ప్రభాకర్ కు రుణపడి ఉంటామని సోమారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీస బీరయ్య అన్నారు.గత ఎన్నో ఏళ్ల నుండి అభివృద్ధికి నోచుకోని సోమారం గ్రామపంచాయతీ పరిధిలోని గర్రెపల్లి గ్రామానికి సంబంధించిన కల్వర్టు పనులు గురువారం ప్రారంభించారు. గర్రెపల్లి గ్రామస్తులు ప్రతినిత్యం తమ అవసరాలకు సైదాపూర్ మండలానికి వెళతారు. సరైన రోడ్డు మార్గం లేక వర్షాకాలం వస్తే వరదనీరుతో గ్రామ ప్రజలకు నిత్యం రాకపోకలు చాలా ఇబ్బందికరంగా ఉండేవి. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి వెంటనే కల్వర్టు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి పొన్నం కు గర్రెపల్లి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల్ ప్రెసిడెంట్ దంతా సుధాకర్, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుండారం శ్రీనివాస్,  పంతంగి అరుణ రవీందర్, సీనియర్ నాయకులు కౌడగని కిషన్, వేముల కొమురయ్య, వీరగోని శంకర్, సముద్రాల తిరుపతి, పడాల మొగిలి, దొనికెన రమేష్, గడ్డం అబ్బయ్య, వీరగోని సదానందం, పసికే సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.