
పీకల్లోతు కష్టాల్లో బెజవాడ..
121 ఏళ్లలో ఎన్నడూ చూడని వరద సిరా న్యూస్,విజయవాడ; ఆగస్టు 30 నుంచి నిన్నటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థమైంది. ఆకస్మిక వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా.. పీకల్లోతు నీటిలో ఉన్నవారందరినీ రెస్క్యూ బృందాలు బోట్లు, ట్రాక్టర్ల సహాయంతో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భారీ వర్షానికి విజయవాడ పరిస్థితి దయనీయంగా మారింది. వర్షాలు తగ్గినా.. బుడమేరు కట్ట తెగడంతో సింగ్ నగర్, రాణిగారితోట, ఆ పరిసర ప్రాంతాలు వరదముంపుకు గురయ్యాయి. అక్కడి నివాసితులంతా ఇళ్లను వదిలేసి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.మరోవైపు.. ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తడంతో అధికారులు 70 గేట్లను ఎత్తి వరద నీటిని సముద్రంలోకి వదిలారు. విజయవాడను కృష్ణమ్మ పరవళ్ల నుంచి కాపాడేందుకు కట్టిన రిటైనింగ్ వాల్ కూడా వరద తాకిడికి ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణలంక ప్రాంతం ఇప్పటికే…
