
కాంగ్రెస్, గులాబీ మధ్య.. బీజేపీ
సిరా న్యూస్,హైదరాబాద్; నీరు పల్లమెరుగు.. నిజము దేవుడెరుగు’.. అనేది సామెత. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు నేతల తీరు చర్చనీయాంశం అయింది. ప్రభుత్వాలతో వారు వారు పొట్లాడకుండా మధ్యలోకి మరో పార్టీని లాగుతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇరు రాష్ట్రాల్లోనూ ఇదే తరహా రాజకీయం నడుస్తుండడం వెనుక కారణాలు ఏమై ఉండొచ్చు అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. వారు ఆరోపిస్తున్న వాటిలో నిజమెంతో తెలియదు కానీ.. మధ్యలోకి కేంద్రాన్ని లాగుతుండడం గమనార్హం.ఏపీలో ఏ చిన్నపాటి ఇష్యూ జరిగినా మాజీముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మధ్యలోకి బీజేపీని లాగుతున్నాడు. చంద్రబాబుపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నిస్తున్నాడు. ఆయనను ఎందుకు ప్రశ్నించడం లేదని అంటున్నాడు. ప్రతీ అంశంలోనూ ఆయన దీనినే ఫాలో అవుతున్నాడు. ఒకవిధంగా ఆయన బీజేపీని రాజకీయంగా బ్లాక్ మెయిల్ చేస్తూ వస్తున్నాడు. అయితే.. నిన్నటికి నిన్న కేటీఆర్…
