తాజా వార్తలు

Bhimadevara Palli ZPHS School: విద్యార్థుల‌కు బ‌హుమ‌తులు ప్ర‌దానం

సిరాన్యూస్‌,భీమదేవరపల్లి విద్యార్థుల‌కు బ‌హుమ‌తులు ప్ర‌దానం హనుమకొండ జిల్లా భీమదేవర పల్లి మండలం వంగర జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో డ్రగ్స్ దుర్వినియోగం, వాటి వల్ల కలిగే దుష్ప పరిణామాలపై వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించారు.ఈ సంద‌ర్బంగా ప్రతిభ చూపిన విద్యార్థులు సంతాబాద్, ఈశ్వర్, రిషిత్, శాన్వి,సన్నీ,జస్వంత్ లకు బహుమతులు అందజేసి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాలలో సామాజిక అంశాల పట్ల అవగాహన కోసం విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాస పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు తాత్కాలిక సంతోషాల కోసం మాదాక దవ్యాలకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు.తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారో నిత్యం గమనిస్తూ ఉండాలని కోరారు.

Read More
10 Aug 2024, 6:56 pmsiranews.in