Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 8 February 2024, 3:40 pmEditor : Sira News

BJP: బీజేపీ అధికారంలోకి రావడానికి సహకరించండి

కాగజ్ నగర్, సిరా న్యూస్ 

అబ్ కి బార్ చార్ సౌ పార్ అనే నినాదం తో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసి కేంద్రంలో మరో సారి బీజేపీ ప్రభుత్వాన్ని   అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని శక్తి వందన్ రాష్ట్ర సమన్వయకర్త, మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి పిలుపునిచ్చారు.
ఆసిఫాబాద్ జిల్ల కాగజ్ నగర్ పట్టణంలో జరిగిన శక్తి వందన్ కార్యక్రమం జిల్లా స్థాయి సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ శక్తి వందన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి నాయకులు గ్రామస్థాయిలో స్వయం సహాయక సంఘాలను, స్వచ్చంద సంస్థలను కలిసి, నరేంద్ర మోదీ ప్రవేశపేడుతున్న సంక్షేమ పథకాల గురించి వారికి వివరించాలన్నారు.  ఈనెల చివరి వారంలో మోదీ వర్చువల్ గా పాల్గొనే మీటింగ్ కి వారందరూ హాజరయ్యేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపెల్లి శ్రీనివాస్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.