
అసంతృప్తులను ఏకం చేస్తున్న బీజేపీ
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణ బిజెపి అసంతృప్తులను యాక్టివ్ చేస్తుందా? ఏ నియోజకవర్గంలో అసంతృప్తి లేకుండా చేసుకునే ప్రయత్నం చేస్తుందా? నేతల మధ్య సమన్వయం ఏర్పాటు చేసి గెలుపే లక్ష్యంగా పార్టీ అడుగులు వేస్తుందా? జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి ఎలాంటి డైరెక్షన్ ఇచ్చింది? పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ ఎలాంటి వ్యూహాలను అవలంబిస్తున్నారు? ఇంతకీ పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవడానికి బిజెపి మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఎన్నికల్లో గెలవాలంటే ప్రత్యర్థులపై వ్యూహాలు రచించడమే కాదు.. సొంత పార్టీ నేతల మధ్య సమన్వయం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని కాషాయ పార్టీ పనిచేస్తుంది. కీలకమైన నేతలు ఎవరు కూడా అసంతృప్తిగా ఉండకుండా చూసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారో పార్టీ ఎన్నికల ఇంచార్జ్…
