Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 28 September 2024, 7:31 pmEditor : SIRA NEWS

BJP Patange Brahmanand : బీజేపీ స‌భ్య‌త్వానికి విశేష స్పందన : బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్

సిరాన్యూస్, బేల‌
బీజేపీ స‌భ్య‌త్వానికి విశేష స్పందన : బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్

బిజెపి సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ తెలిపారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్య‌క్ర‌మంలో బీజేపీ జిల్లా అసెంబ్లీ కన్వీనర్ విజయ్ బోయర్, మండల అధ్యక్షుడు దత్తానిక్కం,మాజీ సర్పంచ్ ఇంద్ర శేఖర్,బీజేవైఎం మండల అధ్యక్షుడు పొత్ రాజ్ నవీన్, బీజేపీ జనరల్ సెక్రెటరీ సందీప్ ఠాక్రే, గణేష్, రాము బర్కడే, నారాయణ్ ఉప్పల్ వార్, తదితరులు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.