Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 3 May 2024, 12:30 pmEditor : Sira News

తన తండ్రి లాగే నన్ను ఆశీర్వదించండి మరింత సేవ చేస్తా

చంద్రగిరి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
 సిరా న్యూస్,చంద్రగిరి;
మన ఊరికి మన మోహిత్ కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నియోజకవర్గం లోని చిగురువాడ పంచాయతీలో పర్యటించారు. వైసిపి నాయకులు కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు మోహిత్ రెడ్డికి. గడప గడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ వైసిపికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు .వేల కోట్ల రూపాయలు అభివృద్ధి తో పాటు చిగురువాడకు అనేక సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. తన తండ్రి లాగానే నన్ను కూడా ఆదరించి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. గత 40 ఏళ్ల పైగా చేయని అభివృద్ధి ఈ 5 సంవత్సరాలలో చేశామని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పంచాయతీనీ మరింత అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.