Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 14 February 2024, 4:33 pmEditor : SIRA NEWS

Blood donation:ఆపద్బాంధవుడు

సిరా న్యూస్, నిర్మ‌ల్‌
ఆపద్బాంధవుడు
*ర‌క్త‌దానం చేసిన కొప్పుల న‌వీన్‌
*అభినందిస్తున్న ప‌ట్ట‌ణ వాసులు
నిర్మల్ జిల్లాలోని వెంగ్వపెట్ గ్రామానికి చెందిన‌ కొప్పుల నవీన్ అనే యువకుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.  ఈయువ‌కుడు నిర్మల్లో ప్రైవేటు కళాశాలలో భౌతిక శాస్త్ర ఆధ్యాపకుడిగా పని చేస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.  ఎంతోమంది రక్తదానం చేశారు.  ఇతరులకి రక్తదానం చేయడం గూర్చి వివరిస్తూ ప్లేట్లెట్స్ అవసరం ఉన్న ప్రతి సందర్భంలో నేనున్నాను అంటూ ముందుకు వ‌స్తున్నారు.  ఎంతోమందికి సహాయాన్ని అందించారు. బుధ‌వారం నిర్మల్ లోహుస్సెన్ బేగం అనే 25 ఏళ్ల యువతికి O + 4 శాతం రక్తం ఉండటం చేత రక్తం అవసరం అని నవీన్ ని సంప్రదించారు.  వెంట‌నే స్పందించిన న‌వీన్ ర‌క్త‌దానం చేశారు. న‌వీన్‌ 25 వ సారి రక్తాన్ని అందించి అందరికీ ఆదర్శం గా నిలిచారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ఆయ‌న‌ను అభినందించారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.