Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 5 March 2024, 8:05 pmEditor : SIRA NEWS

BM Nadal: స్టీల్ ప్లాంట్ పోరాటానికి సిద్ధం

సిరాన్యూస్‌, అనంతపురం
స్టీల్ ప్లాంట్ పోరాటానికి సిద్ధం
* స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షులు బీఎం నాదల్
స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకై పోరాటానికి సిద్ధమ‌ని స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షులు బీఎం నాదల్ అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం కృషి పట్టణంలో ఏపీ ఎన్జీవో భవనంలో స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షులు నాదల్ ఆధ్వర్యంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పి డి ఎస్ యు, మహిళా సమాఖ్య, ఆల్ మెగా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ సాధన కోసమై తాము ఎల్లప్పుడూ మద్దతు ఇస్తామని నాదల్ కి తెలిపారు. వెనకబడిన అనంతపురం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లయితే అనేక మంది యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులు వారి మేనిఫెస్టోలో స్టీల్ ప్లాంట్,కుద్రేముక్ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో స్టీల్ ప్లాంట్ సాధనకై ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు. తాము ఏ రాజకీయ నాయకులకు మద్దతు కాదని నిరుద్యోగ యువకుల పట్ల నిరంతరం పోరాటమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.