
Bommanapally: వాడీవేడిగా బొమ్మనపల్లి గ్రామసభ
సిరాన్యూస్, చిగురుమామిడి వాడీవేడిగా బొమ్మనపల్లి గ్రామసభ * రెండు బోర్లు వేస్తామన్న హామీ ఏమైనట్లు * ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని ఎప్పుడు నిర్మిస్తారు * ప్రత్యేక అధికారి గ్రామసభకు ఎందుకు హాజరు కావడం లేదు * గ్రంథాలయం ఎప్పుడు ఏర్పాటు చేస్తారు బొమ్మనపల్లి గ్రామసభ సమస్యలు లేవనెత్తుతూ వాడీవేడిగా జరిగింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో మంగళవారం గ్రామసభను కార్యదర్శి రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రారంభమైన గ్రామసభలో గ్రామ ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న తరుణంలో గ్రామ ప్రత్యేక అధికారి వినయ్ సాయి ఎందుకు గ్రామ సభకు హాజరు కావడం లేదని పలువురు ప్రశ్నించారు. ప్రత్యేక అధికారి లేకుండా తమ సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. 11వ…
