
జనసేన గూటికి బొత్స లక్ష్మణరావు…?
సిరా న్యూస్,విజయనగరం; వలస రాజకీయంలో ఇదో పెద్ద ట్విస్టు.. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఊహించని మార్పు. రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఉత్తరాంధ్ర నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి ఓ కీలక నేత జనసేనలో చేరనున్నాడనే సమాచారం ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లు కుటుంబమే బొత్సకు బలం అనుకుంటుండగా, ఆ కుటుంబం నుంచి ఒకరు బొత్సను ధిక్కరించి రాజకీయంగా విభేదించి జనసేనలో చేరతానని ప్రకటించడం పొలిటికల్‌గా హీట్ పుట్టిస్తోంది. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో బొత్స కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఓడించేలా ఆయన సొంత సోదరుడే పావులు కదిపాడనే ప్రచారం కూడా కాక రేపుతోంది. ఈ పరిస్థితుల్లో ఇన్నాళ్లు ఊహాగానమే అనుకున్నా.. బొత్స ఫ్యామిలీ వార్ నిజమని తేలిపోయిందని అంటున్నారు.ఉత్తరాంధ్ర లీడర్లలో బొత్సకు ఎదురులేదని చెబుతుంటారు. గత ఎన్నికల్లో ఓడినా అధిష్టానం వద్ద పరపతితో గత…
