తాజా వార్తలు

నల్లబ్యాడ్జీలతో బీఆర్‌ఎస్ నిరసన

సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నల్లబ్యాడ్జీలతో బీఆర్‌ఎస్ నిరసన తెలిపింది. బుధవారం సీఎం, డిప్యూటీ చేసిన మహిళలపై చేసిన కామెంట్స్‌కు క్షమాపణలు చెప్పాల్సిన ఆ పార్టీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆ కామెంట్స్‌కు నిరసనగానే ఇలా నల్లబ్యాడ్జీలతో సభకు హాజరైనట్టు సభ్యులు పేర్కొన్నారు. మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణలు చెప్పాలని సభలో కూడా బీఆర్‌ఎస్‌ సభ్యులు డిమాండ్ చేశారు. ఓవైపు మంత్రులు బిల్లులు ప్రవేశపెడుతున్నారు మరోవైపూ బీఆర్‌ఎస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన కామెంట్స్‌కు సభలో క్షమాపణ చెప్పాల్సిందేనంటూ నినాదాలు చేశారు. అప్పటి వరకు తమ నిరసన కొనసాగుతుందని గట్టిగా అరుస్తూ చెప్పారు. దీనిపై మాట్లాడేందుకు తమక అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అయినా స్పీకర్ వాళ్లకు అవకాశం ఇవ్వలేదు. అసెంబ్లీ సమావేశాలు…

Read More
1 Aug 2024, 4:50 pmsiranews.in