
బుచ్చయ్యకే రాజమండ్రి రూరల్
సిరా న్యూస్,రాజమండ్రి; తెలుగుదేశం-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదలకావడంతో చాలా నియోజకవర్గంలో చిక్కుముడులన్నీ వీడిపోయాయి. అభ్యర్థులు ఖరారైన చోట చిన్నపాటి అలకలు, అసంతృప్తులు చోటుచేసుకుంటుండగా...చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి వారిని పిలిపించి మాట్లుడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చి బుజ్జగిస్తున్నారు. కానీ ఇంకా అభ్యర్థులను ప్రకటించని చోటే ఇబ్బందులు వీడటం లేదు. తెలుగుదేశం కంచుకోటలపై జనసేన గురిపెట్టడం...టిక్కెట్ మాదేనంటే మాదేనని ఎవరికి వారు ప్రకటించుకోవడం అధినేతలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా రాజమండ్రి రూరల్ నియోజవర్గం అభ్యర్థి ఎంపిక అటు చంద్రబాబుకు, ఇటు పవన్ కల్యాణ్ కు ఇబ్బందిగా మారింది.గోరంట్ల బుచ్చయ్య చౌదరి..కాకలుతీరిన రాజకీయ నాయకుడు. ఎన్టీఆర్ హయాం నుంచి తెలుగుదేశం పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న నిస్వార్థ సేవకుడు. ఇప్పటికే ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 75 ఏళ్ల వయసులోనూ యువకుల మాదిరిగా…
