ఆంధ్రప్రదేశ్

buffalo: పురుగుల మందుతో గేదె మృతి

సిరాన్యూస్‌, కుందుర్పి పురుగుల మందుతో గేదె మృతి పురుగుల మందు నీరు తాగి గేదె మృతి చెందిన సంఘ‌ట‌న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి, మండలం లక్ష్మoపల్లి పంచాయతీలో చోటు చేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... కుందుర్పి మండలం వైస్ ఎంపీపీ వడ్డే ముత్యాలు సంబంధించిన గేదెకు తాగు నీటి తొట్టెలో పురుగుల మందును క‌లిపారు. ఈ విష‌యపు నీరు తాగి గేదె మృతి చెందింది. ఈ గేదె విలువ రూ. 1,20,000 ఉంటుందని తెలిపారు. తాగు నీటి తొట్టిలో పురుగుల మందును కలిపి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇలాంటి దురాఘాతలకు పాల్పడిన వారు ఎంతటి వారు అయినా కఠినంగా శిక్షించాలని రైతు కోరుతున్నారు.

Read More
20 May 2024, 12:35 pmsiranews.in