
సీతక్క ఊరికి బస్సుBus to town
సిరా న్యూస్,వరంగల్; గిరిజన ప్రాంతాల్లో వసతుల విషయంలో ప్రభుత్వాలు చెబుతున్న గణాంకాలకు.. వాస్తవ పరిస్థితికి అస్సలు పొంతన ఉండదు. ఇప్పటికీ రవాణా కష్టాల్లో బతుకు బండి లాగిస్తున్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి. సరైన రోడ్డు ఉండదు. మౌలిక వసతులు సైతం గిరిజనులు ఎరుగరు. ప్రభుత్వాలు మాత్రం అంత సవ్యంగా ఉన్నట్లు చెబుతుంటారు. అయితే ప్రజా ప్రతినిధులు దృష్టిసారించే గ్రామాలు మాత్రం అభివృద్ధి చెందుతున్నాయి. ఈ కోవలోకి వస్తుంది జగ్గన్నపేట గ్రామం. మొన్నటి వరకు ఆ ఊరు ఎక్కడ ఉందో తెలియనట్టుగా అధికారులు ఉండగా.. ఇప్పుడు ఉరుకులు పరుగులు పెట్టి ఆ గ్రామం పై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. మంత్రి సీతక్క సొంత గ్రామం కావడమే అందుకు కారణం.ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి సీతక్క గెలుపొందిన సంగతి తెలిసిందే. రేవంత్ క్యాబినెట్లో ఆమె…
