
గెలిచే నేతలకే పిలుపులు
సిరా న్యూస్,ఒంగోలు; వైఎస్ జగన్ రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు అన్ని ఈక్వేషన్లు చూస్తున్నారు. సొంత సామాజికవర్గాన్ని సయితం పక్కన పెట్టి గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తున్నారు. వివిధ సంస్థల సర్వేల నివేదికలతో పాటు సామాజిక కోణాన్ని కూడా జగన్ నిశితంగా పరిశీలిస్తున్నారు. సామాజికవర్గాల వారీగా ఫ్యాన్ పార్టీ వైపు తిప్పుకునేందుకు ఈసారి గట్టి ప్రయత్నమే జగన్ చేస్తున్నారు. తలపండిన రాజకీయ నేతలకు సయితం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు మింగుడుపడటం లేదు. ఎవరినీ లెక్క చేయడం లేదు. ఒక్కటే దారి.. అదే గెలుపు బాట. అందుకోసం అయిన వారినయినా సరే పక్కన పెట్టేందుకు రెడీ అయిపోతున్నారు. తాజాగా వైశ్య సామాజికవర్గానికి చెందిన మద్దాలి గిరిని కూడా జగన్ పక్కన పెట్టేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ గత ఎన్నికల్లో టీడీపీ నుంచ పోటీ చేసి గెలిచి తర్వాత…
