
మారని కెనడా వైఖరి
సిరా న్యూస్,న్యూఢిల్లీ; ప్రశాతంగా ఉన్న భారత్‌లో చిచ్చు పెట్టాలని ఇప్పటికే దాయాది దేశం పాకిస్తాన్, మరో పొరుగు దేశం చైనా తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. వీటిని భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఈ రెండు దేశాలకు మరో దేశం తోడైంది. ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్‌కు వత్తాసు పలుకుతూ భారత్‌తో గిచ్చి కయ్యం పెట్టుకుంటోంది.నిజ్జర్ మొదటి వర్ధంతి సందర్భంగా కెనడా పార్లమెంట్ నివాళులర్పించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఖలిస్తానీ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ గతేడాది కెనడాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా ముందు జరిగిన కాల్పుల్లో మృతిచెందాడు. భారత్ విడుదల చేసిన 40 మంది తీవ్రాదుల జాబితాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ పేరు కూడా ఉండడం గమనార్హం.నిజ్జర్‌ను హత్య చేసిన వారిలో నలుగురు భారతీయులు కరణ్ బ్రార్, అమన్‌దీప్‌సింగ్, కమల్ ప్రీత్‌సింగ్,…
