
వీవీ ప్యాట్లు లెక్కించడం కుదరదు
సిరా న్యూస్,న్యూఢిల్లీ; ఈవీఎమ్, వీవీప్యాట్‌లపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వీటిపై దాఖలైన అన్ని పిటిషన్‌లను తిరస్కరించింది. వీవీప్యాట్‌లలోని స్లిప్‌లను EVMలతో 100% సరిపోల్చాలంటూ వేసిన పిటిషన్‌లను కొట్టివేసింది. పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్విహించాలన్న పిటిషన్‌నీ తిరస్కరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఇద్దరూ వేరువేరుగా ఈ పిటిషన్‌లపై తీర్పునిచ్చారు. తోపాటు మరో ఇద్దరు వేసిన పిటిషన్‌లను బుట్టదాఖలు చేసింది. ఇదే సమయంలో ఎన్నికల సంఘానికి కీలక సూచనలు చేసింది. EVMలో పార్టీ గుర్తుల్ని లోడ్ చేసిన తరవాత సింబల్ లోడింగ్ యూనిట్‌ని సీల్ చేయాలని వెల్లడించింది. వాటిని కంటెయినర్లలో భద్రపరచాలని తెలిపింది. అభ్యర్థులు లేదా వాళ్ల ప్రతినిధులు ఆ సీల్‌పై సంతకం పెట్టాలని సూచించింది. ఈ సింబల్ లోడింగ్ యూనిట్స్ ఉన్న కంటెయినర్స్‌ని స్టోర్‌రూమ్‌లో ఈవీఎమ్‌లతో పాటు భద్రపరచాలని…
