
అమెరికా లో వైసీపీ నేతలపై కేసులు…
సిరా న్యూస్,వాషింగ్టన్; ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్‌సీపీ నేతగా చెలామణి అవుతున్న సత్తారు వెంకటేష్ రెడ్డి అనే వ్యక్తిని అమెరికాలో సెయింట్ లూయిస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడం సహా అనేక నేరాల కింద కేసు నమోదు చేశారు. ఇరవై ఏళ్ల యువకుడ్ని చదువు పేరుతో అమెరికాకు తీసుకు వచ్చి ఇంట్లో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు. చెప్పిన మాట వినకపోతే ఇష్టం వచ్చినట్లుగా దాడి చేస్తున్నాడు. పీవీసీ పైపులతో కొడుతున్నారు. రోజుకు కనీసం మూడు గంటలుకూడా నిద్రపోనీయకుండా పని చేయించుకుంటూ… పదే పదే హింహిస్తూండటంతో ఆ ఇరవై ఏళ్ల యువకుడు పూర్తిగా బలహీనపడ్డాడు. ఇతని పరిస్థితి చూసిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సత్తారు వెంకటేష్ రెడ్డితో పాటు మరో ఇద్దర్ని అరెస్టు చేశారు. బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు.సెయింట్ చార్లెస్ కౌంటిలోని…
