
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నగధు పురస్కారం
సిరా న్యూస్,కమాన్ పూర్; స్వంత గ్రామం పై మమకారంతో, తన తండ్రి దివంగత ప్రభుత్వ పాఠశాల ప్రధానాచార్యులు సౌమిత్రి నారాయణచార్యుల జ్ఞాపకంగా హైద్రాబాద్ చిలుకలగూడ కట్టా మైసమ్మ ప్రధాన పూజారి సౌమిత్రి తిరుమలచార్యులు కల్వచర్ల ప్రభుత్వ పాఠశాలకు బడిగంట, విద్యార్థులకు నోటు బుక్కులు, పెన్నులతోపాటు, 35వేల ఖరీధుగల షూలు, సాక్సులు, పరీక్ష ప్యాడులను అందజేశారు. అంతేగాక విద్యార్థులను ప్రోత్సహిస్తూ యస్.యస్.సి ఫలితాలలో మొదటి మూడు ర్యాంకర్లకు ప్రోత్సాహక బహుమతి, అభినందన పురస్కారంగా ముగ్గురికి కలిపి పదివేల రూపాయలు గత యేడు ప్రకటించారు కాగా మొదటి బహుమతి కారుపాకల అమల-శ్రీనివాస్ దంపతుల కూతురు కీర్తన (8.8జిపిఏ) కు 5,000/-, రెండవ బహుమతి యాదగిరి రమ-కుమారస్వామి కూతురు భావన (8.5జిపిఏ)కు 3000/-, మూడవ బహుమతి కందికట్ల స్వప్న-శ్రీనివాస్ కూతురు అంకితకు 2000/-లను ఈ స్వాతంత్ర్య దినోత్సవం పాఠశాల వేడుకలలో తన…
