చిగురుమామిడి, సిరా న్యూస్
కులవివక్షత పాటిస్తే కఠిన చర్యలు
కుల వివక్షను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ నరేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా ఇందుర్తిలో జరిగిన పౌరహక్కుల దినోత్సవంలోజరిగిన కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో మంగళవారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీపీ కొత్త వనిత శ్రీనివాస్ రెడ్డి జెడ్పీటీసీ గికురు రవీందర్ హాజరయ్యారు. గ్రామాల్లో రెండు గ్లాసుల పద్ధతి కానీ కులం పై వివక్షత ఎవరు చూపిన కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు గ్రామంలో అందరూ కులమతాలకతీతంగా కలిసికట్టుగా ఉండి గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని కోరారు అంతకుముందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నరసయ్య గ్రామ సర్పంచ్ అందే స్వరూప స్వామి ఎంపీటీసీ స్వప్న చిన్న స్వామి గిరిదవరి శైలజ, కార్యదర్శి వెంకటరమణారెడ్డి ఏఈవో సతీష్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయప్రద, లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ గాదే రఘునాథ్ రెడ్డి, అంబేద్కర్ సంఘం నాయకులు అంద పరశరాములు, లక్ష్మణ్, వార్డు సభ్యులు చింతపూల శ్యామల మౌనిక అప్పల యశోద, సుదగోని శ్రీనివాస్ కో ఆప్షన్ సభ్యులు చింతపూల కొమురయ్య, రాజయ్య పోలీస్ సిబ్బంది ఏఎన్ఎం కవిత ఆశ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.