తాజా వార్తలు

Cast Vote With One Month Old Child: నెల రోజుల బాబుతో పోలింగ్‌ కేంద్రానికి..

సిరా న్యూస్, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ న్యాయవాది జోండలే అజయ్‌ కుమార్‌ (Ajay Kumar) తన నెల రోజుల కుమారుడు, సతీమణీతో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. ఈ మేరకు గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఆయన తన సతీమణీతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన వరం ఓటు హక్కు అని అన్నారు. ఇలాంటి అమూల్యమైన ఓటు హక్కును ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకొని, బాధ్యత గల పౌరులుగా తమ విధిని నిర్వర్తించాలని అన్నారు.

Read More
30 Nov 2023, 8:57 pm
Updated: 30 Nov 2023, 9:00 pm
siranews.in