
సెంట్రల్ కరప్షన్ స్టేషన్….
సిరా న్యూస్,హైదరాబాద్; హైదరాబాద్ పోలీస్ విభాగంలో అత్యంత కీలకమైనది సిసిఎస్ విభాగం. ఇందులో కోట్ల రూపాయల స్కామ్‌కు పాల్పడిన కేసులో దర్యాప్తు జరుగుతోంది. సీసీఎస్ కేంద్రంగా సాగుతున్న దందాలను చూస్తుంటే అవినీతికి అడ్డూ అదుపు లేదనిపిస్తోంది. పోలీస్ శాఖలో వందల కోట్ల స్కాం ఫైల్స్ మిస్ అవుతున్నాయి. అందుకు సీసీఎస్ పోలీస్ స్టేషన్ అడ్డాగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతికి అలవాటు పడ్డ అధికారులు వాటిని మిస్ యూజ్ చేస్తున్నారు. చార్జిషీట్ వేయడంలో అలస్యం చేస్తూ, కోట్ల రూపాయల లంచం తీసుకుంటున్నారు. కేసును వీక్ చేయడానికి ఓ లెక్క, తప్పించడానికి మరో లెక్క, ఇలా అవినీతిని పంచుకుంటున్నారు. ట్విస్ట్ ఏంటంటే, బాధితుల తరుఫున కూడా డబ్బులు తీసుకోవడం ఇక్కడి స్పెషల్. అందుకే ఏసీపీ ఉమామహేశ్వర్ రావు విచారణలో ఎన్నో విషయాలు బట్టబయలు అయ్యాయి. అల్వాల్ ఏరియాలో దొరికిన…
