
వైసీపీ జిల్లా అధ్యక్షల మార్పులు
సిరా న్యూస్,అనంతపురం; ఊహించని పరాభవం తర్వాత వైసీపీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయడానికి మాజీ సీఎం వైఎస్ జగన్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో ముందుగా ఆయన ఆనంతపురం జిల్లాపై ఫోకస్ పెట్టినట్టు చెప్తున్నారు. 2019 నుంచి అధికారంలో ఉన్న వైసీపీకి జిల్లా రథసారధిగా మొదట శంకర్ నారాయణ కొనసాగారు. జిల్లాల విభజన తర్వాత అనంతపురానికి పైలా నర్సింహయ్య.. సత్యసాయి జిల్లాకు హిందూపురం నేత నవీన్ నిశ్చల్ నియమితులయ్యారు. అయితే ప్రక్షాళనలో భాగంగా జగన్ ఈసారి ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారో అని తీవ్రంగా చర్చ జరుగుతోందిఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీకి మొదటి నుంచి అండగా ఉంటున్నది రెడ్డి సామాజిక వర్గ నాయకులు. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో బీసీ కార్డును ముందుపెట్టి ఆ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో 14 ఎమ్మెల్యే స్థానాల్లో…
