ఆంధ్రప్రదేశ్

సీనియర్లకు చంద్రబాబు షాక్

సిరా న్యూస్,తిరుపతి,  వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకం. ఒక విధంగా చెప్పాలంటే చావోరేవో లాంటివి. అందుకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపారు. జనసేన తో పొత్తు పెట్టుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. ఈ తరుణంలో కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ఎన్నడూ లేని విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఈసారి సీనియర్లకు షాక్ ఇచ్చారు. కుటుంబంలో ఒకరికి టికెట్ అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎర్రం నాయుడు వారసులకు మినహాయింపు ఇచ్చారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడుఅచ్చెనాయుడు, రామ్మోహన్ నాయుడులకు మినహాయింపు లభించడం విశేషం.జనసేనకు సీట్ల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అటు బిజెపి వస్తే పార్లమెంట్ స్థానాలను కేటాయించాల్సి ఉంది. దీంతో వీలైనంతవరకూ టిక్కెట్ల విషయంలో పొదుపు పాటించాలని చూస్తున్నారు.…

Read More
29 Dec 2023, 1:04 pmsiranews.in