
Charla Medical shops: ఏజెన్సీ అడ్డాగా మెడి”కిల్ “దందా
సిరాన్యూస్, చర్ల: ఏజెన్సీ అడ్డాగా మెడి"కిల్ "దందా * ఇటు మెడికల్ షాపులు అటు ఆర్ఎంపీలు * అంతా ఇష్ట రాజ్యం * ఆర్థికంగా గుల్లవుతూ ప్రాణాలు.. ? సైతం హరి * నిబంధనలకు పాతర * కానరాని అధికారుల పర్యవేక్షణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ఏజెన్సీ ప్రాంతంలోని మెడికల్ షాపుల దందా , పరిధి దాటి చేస్తున్న ఆర్ఎంపీ వైద్యం. ఒకరేమో రోగులను ఆర్థికంగా గుల్ల చేస్తుంటే, మరొకరు పరిధికి మించి వైద్యం చేస్తూ రోగుల ప్రాణాలను హరిస్తున్న చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న అధికారుల తీరు మరీ విడ్డూరం. ఆదివాసీల అమాయకత్వాన్ని, పేదల అవసరం ఆసరా చేసుకుని మెడికల్ షాపుల యజమానులు డాక్టర్లలా సలహాలు ఇస్తూ అడ్డగోలుగా మందులు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా యథేచ్ఛగా నాసిరకం మందుల దందా సాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చర్ల…
