
.Check for Paritala… పరిటాలకు చెక్..
సిరా న్యూస్,అనంతపురం; ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచనలు మారాయి. రాయలసీమలో అత్యధికంగా సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ఆయన తన పూర్వపు మైండ్ సెట్్ను మార్చుకుంటున్నారు. గతంలో చంద్రబాబు పార్టీని కష్టకాలంలో వదిలిపెట్టిన వారిని ఎవరినీ తిరిగీ తీసుకోబోనని చంద్రబాబు ప్రకటించారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో కొందరు పార్టీని వదిలి వెళ్లిపోయారు. అందులో వరదాపురం సూరి ఒకరు. ఆయన 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయి ఐదేళ్లు సేఫ్ గా ఉండటం కోసం భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. పార్టీని వీడి వెళ్లడంతో... దీంతో ధర్మవరం నియోజకవర్గానికి పరిటాల శ్రీరామ్ ను చంద్రబాబు పార్టీ ఇన్ ఛార్జిగా నియమించారు. రాప్తాడు నుంచి తన తల్లి సునీతమ్మ, ధర్మవరం నుంచి తాను పోటీ చేస్తానని, ఇద్దరం అసెంబ్లీలో…
