
ఛలో ఆంధ్రా ఊటీ Chello Andhra Ooty
సిరా న్యూస్,విశాఖపట్టణం; ఆంధ్రా ఊటి అరకులోయ కాశ్మీర్‌ను తలపిస్తోంది. భానుడి లేలేత కిరణాలతో మంచుకొండలు మిరుమిట్లు గొలుపుతున్నాయి. మరోవైపు కొండలపై దట్టంగా అలముకున్న పొగ మంచు నురగలు కక్కుతున్న పాలసముద్రాన్ని తలపిస్తోంది. అల్లూరి జిల్లా ఏజెన్సీ లో దట్టంగా కురుస్తున్న పొగమంచు సోయగాలతో ప్రకృతి పర్యాటకులను రారమ్మంటోంది. వీకెండ్ కు తోడు క్రిస్మస్ వరుస సెలవు దినాలు కావడంతో పర్యాటకులు అరకువైపు పరుగులు తీస్తున్నారు. మేఘాల కొండలైన వంజంగి, మాడగడ కు పర్యాటకులు పోటెత్తారు. ముందే వచ్చిన సీజన్ తో ఎంజాయ్ చేస్తున్నారు సందర్శకులు. పాడేరు ప్రాంతంలోని వంజంగి మేఘాల కొండ తో పాటు.. అరకు లోయలోని మాడగడ మేఘాల కొండల్లో పాల సముద్రాన్ని తలపించేలా పొగ మంచు కొమ్ముకుంది. ఇక్కడి సుందర దృశ్యాలు చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. సూర్యోదయం వేళ కొండల మధ్య లోయలో…
