క్రీడలు

Chess Champion Maruthi: అకొండపేట అబ్బాయి ఆటల్లో అదుర్స్…

సిరా న్యూస్, దస్తురాబాద్: అకొండపేట అబ్బాయి ఆటల్లో అదుర్స్... + రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలకు ఎంపికైన జాడి మారుతి + అభినందించిన గ్రామస్తులు, ఉపాధ్యాయులు నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం అకొండ పేట గ్రామానికి చెందిన జాడి మారుతి రాష్ట్రస్థాయి చదరంగం పోటీలకు ఎంపికయ్యారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో చదువుతున్న మారుతి ఈనెల 13న నిర్వహించిన ఉమ్మడి జిల్లా చదరంగం పోటీల్లో ఆయన అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ఉపాధ్యాయులు తెలిపారు. త్వరలో రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న చదరంగం పోటీల్లో పాల్గొననున్న అతన్ని గ్రామస్తులు, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయిలో సైతం సత్తా చాటాలని ఆకాంక్షించారు.

Read More
17 Dec 2023, 1:36 pm
Updated: 17 Dec 2023, 1:37 pm
siranews.in