
చిత్తూరు… బెట్టింగ్ జోరు…
సిరా న్యూస్,తిరుపతి; ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బెట్టింగ్ జెట్ స్పీడ్‌ను అందుకుంది. టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు మాజీ సీఎం కిరణ్, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా ఇలా ప్రముఖులు బరిలో ఉన్న చిత్తూరు జిల్లాలో పలు రకాల పందాలు కొనసాగుతున్నాయి. కుప్పంలో లక్ష ఓట్ల టిడిపి టార్గెట్ నుంచి గెలుపు ఓటములపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగులు నడుస్తున్నాయి. మరోవైపు పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి, నగరిలో మంత్రి ఆర్కే రోజాల గెలుపు ఓటములుపైనా మెజారిటీలు లెక్కలేసుకుంటున్న పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున బెట్టింగులకు తెర తీశారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. చిత్తూరు జిల్లాలో ఏ పార్టీ పైచెయ్యి సాధిస్తుందన్న పందాలు కూడా నడుస్తున్నాయి.ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కుప్పం, పుంగనూరు, చంద్రగిరి, తిరుపతి, చిత్తూరు, నగరి, శ్రీకాళహస్తి అసెంబ్లీ సెగ్మెంట్ లనే…
