
చిత్తూరు..ప్లేట్ ఫిరాయించేశారు
సిరా న్యూస్,తిరుపతి; చిత్తూరు జిల్లాలో వైసీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ తో పాటు పాలకవర్గ సభ్యులంతా టిడిపిలో చేరేందుకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్, ఇతర కార్పొరేటర్లు టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధమైంది. వారంతా మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు సిద్ధపడటం విశేషం. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా చిత్తూరులో మెజారిటీ కార్పొరేషన్ లో అప్పటి అధికార వైసిపి ఏకగ్రీవాలు చేసుకుంది. ఏకపక్ష విజయాలను సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో.. చిత్తూరు కార్పొరేషన్ కార్యవర్గమంతా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధపడటం విశేషం.చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి తో సహా పలువురు కార్పొరేటర్లు…
