Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 21 June 2024, 2:44 pmEditor : Sira News

చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య

సిరా న్యూస్,మేడ్చల్;
చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపా దేవి ఆత్మహత్య చేసుకున్నారు. అల్వాల్ లోని పంచశీల కాలనీలోని నివాసంలో ఆమె ఉరి వేసుకున్నారు. రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది.
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రూపాదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా.. ఆమె రెండు రోజుల నుంచి స్కూలుకు వెళ్లలేదని సమాచారం రమాదేవి ఆత్మహత్య అర్ధరాత్రి బయటకు వచ్చింది. ఆత్మహత్యకు ముందు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు భార్య వీడియో కాల్ చేసారు.బుధవారం అల్వాల్ నుంచి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండికి వెళ్లగా, సాయంత్రం ఆయనకు రూపాదేవి వీడియో కాల్ చేసి చనిపోతున్నానని చెప్పారు. మేడిపల్లి సత్యం ఇంటికి చేరుకునేలోపే ఆమె ఆత్మహత్య చేసుకోగా, విగతజీవిగా పడి ఉన్న భార్యను చూసి సత్యం బోరున విలపించారు.
====

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.