Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 20 July 2024, 6:34 pmEditor : SIRA NEWS

CI Bhimesh: ఫోటో టెక్ ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరించిన సీఐ భీమేష్

సిరాన్యూస్, ఇచ్చోడ‌
ఫోటో టెక్ ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరించిన సీఐ భీమేష్

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ఫోటోగ్రాఫర్ వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఐ భీమేష్ చేతుల మీదుగా శ‌నివారం ఫోటో టెక్ ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సీఐ భీమేష్ మాట్లాడుతూ ఈనెల 26, 27, 28, తేదీలలో హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కేబీఆర్ కన్వర్షన్ హాల్ లో ఫోటో ఎక్స్పో జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం సిరికొండ, బజార్హత్నూర్, ఇచ్చోడ మండలాల ఫోటోగ్రాఫర్స్ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఈ ఫోటో ఎక్స్పో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మచ్చ అజయ్, మండల ఉప అధ్యక్షులు ఎరేకర్ దయాకర్, ట్రెజరర్ ఎర్రమ్ మహేష్, కార్యదర్శి తలకొక్కుల వంశీకృష్ణ, ప్రధాన కార్యదర్శి చాకటి రమేష్, రాహుల్, నరసయ్య, విక్రమ్, ప్రశాంత్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.