
CI Faninder: మిస్టర్ టి రెస్టారెంట్ దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్ : సీఐ ఫణిందర్
సిరాన్యూస్, ఆదిలాబాద్ మిస్టర్ టి రెస్టారెంట్ దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్ : సీఐ ఫణిందర్ మావల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 3 వ తేదీ రాత్రి సమయంలో మిస్టర్ టి రెస్టారెంట్లో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ ఫణిందర్ తెలిపారు. ఈ మేరకు మావల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఇందులో దొంగతనం చేసిన వ్యక్తి కుంబోజు రాజేష్ ను, అతనికి సహకరించిన బాలుడుని అదుపులోకి తీసుకొని వారిద్దరి నుంచి రూ.5 వేల నగదు, రెండు సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈకేసులో రెండో వ్యక్తి అయినా బాలుడు అదే రెస్టారెంట్లో వర్కర్ గా పని చేస్తున్నాడు. అతని సహకారంతో కుంబోజు…
