
గజపతి నగరం… ఎవరికి వరం
సిరా న్యూస్,విజయనగరం; విజయనగర జిల్లాలోని మరో కీలక నియోజకవర్గం గజపతినగరం. ఈ జిల్లాలో రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గంగా దీనికి గుర్తింపు ఉంది. అటువంటి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా, ఐదుసార్లు కాంగ్రెస్ పార్టీ, ఐదుసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. గడిచిన నాలుగు ఎన్నికల్లో రెండుసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవగా, ఒకసారి కాంగ్రెస్, మరోసారి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను కూడా ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం కోసం పోరాడుతున్నాయి. గజపతినగరంలో తొలిసారిగా 1955లో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో రెండు స్థానాలకు ఇక్కడ ఎన్నికలు నిర్వహించారు. ఈ రెండు స్థానాల్లోనూ పీఎస్పీ నుంచి పోటీ చేసిన జి సూర్యనారాయణ గెలవగా, ద్విసభకు పోటీ చేసిన…
