
ఏడాది తర్వాత మళ్లీ సాగర్ పై ఘర్షణ
సిరా న్యూస్,గుంటూరు; ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి నాగార్జున సాగర్ వివాదం నెలకొంది. తెలంగాణ అధికారులు కుడి కాల్వ వాటర్ రీడింగ్ నమోదు చేసేందుకు ప్రయత్నించగా, ఏపీ అధికారుల వారిని అడ్డుకున్నారు. దీంతో మరోసారి సాగర్ వివాదం తెరపైకి వచ్చింది. గతేడాది సరిగ్గా నవంబర్ లోనే సాగర్ పై ఘర్షణ తలెత్తింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మరోసారి 'నాగార్జున సాగర్ వివాదం' రాజుకుంది. గత ఏడాది సరిగ్గా నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున నాగార్జున సాగర్ వద్ద యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. మళ్లీ నవంబర్ లోనే సాగర్ వివాదం తెరపైకి వచ్చింది. ఈసారి కుడి కాల్వ వాటర్ రీడింగ్ నమోదు వివాదానికి దారితీసింది. వాటర్ రీడింగ్ తీసేందుకు తెలంగాణ అధికారులు ప్రయత్నించారు. వీరిని ఏపీ ఇరిగేషన్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి…
