Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 17 May 2024, 3:54 pmEditor : Sira News

పటాన్ చెరు లో మూతపడిన సినిమా థియేటర్లు

సిరా న్యూస్,పటాన్ చెరు;
తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా బంద్ చేశాయి. సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ప్రకటించాలని ఆయా సినిమా థియేటర్ల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓటీటీ, కార్పొరేట్ మల్టీఫ్లెక్స్ లు వచ్చిన తర్వాత చిన్న తరహా థియేటర్లు మూసివేసుకునే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. చిన్న తరహా థియేటర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, స్వచ్ఛందంగా పది రోజుల పాటు థియేటర్లను బంద్ చేస్తున్నట్లు బోర్డులు వేశారు.i
=============

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.