
బావబామ్మర్దుల మధ్య కోల్డ్ వార్
సిరా న్యూస్,హైదరాబాద్; ళ్లిద్దరూ రాజకీయ ఉద్దండ కుటుంబం నుంచి వచ్చిన బావ బావమరుదులు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. మంత్రి పదవులలంకరించి పదేళ్లుగా తెలంగాణలో రాజకీయ చక్రం తిప్పారు. తీరా అధికారం లేకపోవడంతో ఇప్పుడు అధికార పక్షం మీద విమర్శనాస్త్రాలతో విరుచుకుపడుతున్నారు. అయితే వారిద్దరి మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఒకరు ఔనంటే ఇంకొకరు కాదని..వీళ్ల వ్యవహారంతో అసలే పీకల్లోతు కష్టాలలో ఉన్న ఆ అగ్రనేతతో సహా పార్టీ సీనీయర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ వాళ్లెవరంటే కల్వకుంట్ల కుటుంబ సభ్యులైన కేటీఆర్, హరీష్ రావు.వీళ్లిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు రాజుకుంటునే ఉన్నాయి. అయినా పరువు కోసం ఇద్దరూ పైకి బాగానే ఉన్నా ఎవరికి వారు సొంత క్యాడర్ ను నమ్ముకుని వారి మద్దతుతో కొనసాగుతున్నారు.ఎప్పుడైతే కేసీఆర్ తన తర్వాత కేటీఆర్…
