తాజా వార్తలు

Collector Pamela Satpathi: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ పమేలా సత్పతి

సిరాన్యూస్‌,చిగురుమామిడి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ పమేలా సత్పతి * చిగురమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. బుధవారం కరీంనగర్ జిల్లా చిగురమామిడి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఫార్మసి రూమ్, ఓపి వార్డులు, ల్యాబ్ రూములను పరిశీలించారు.రిజిస్టర్ లో మందులు వివరాలు పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు.ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయి, ట్రైనీ ఐఏఎస్ అజయ్ యాదవ్, మండల మెడికల్ ఆఫీసర్ సందీప్ రెడ్డి,ఎంపీడీవో మధుసూదన్, ఆర్ఐ సంతోష్…

Read More
6 Nov 2024, 3:53 pm
Updated: 6 Nov 2024, 4:52 pm
siranews.in