
Collector Rajarshi Shah: మహిళా శక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కలెక్టర్ రాజర్షి షా
సిరాన్యూస్, ఆదిలాబాద్ మహిళా శక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కలెక్టర్ రాజర్షి షా మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేసి లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి రాజర్షి షా అధికారులకు తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశం మందిరం లో ఏర్పాటు చేసిన అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపడుతున్న నిర్మాణ పనులు, మహిళా శక్తి కార్యక్రమాల పై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ మహిళా ఉన్నతి-తెలంగాణ ప్రగతి లక్ష్యంతో వచ్చే ఐదేళ్ళ లో మహిళలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళా శక్తి ద్వారా 15 రకాల కార్యక్రమాలు చేపడుతున్నదని అన్నారు. అందులో…
