
సాయం కోసం ఆందోళనలు
సిరా న్యూస్,విజయవాడ; విజయవాడకు భారీ వరదలు తీవ్ర నష్టానికి గురిచేశాయి. గతంలో కానీ విని ఎరుగని రీతిలో విజయవాడ నగరానికి వరద ముంచెత్తింది.దాదాపు సగానికి పైగా నగరం నీటిముంపు బారిన పడింది. లక్షలాదిమంది నిరాశ్రయులు అయ్యారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టింది.సీఎం చంద్రబాబు స్వయంగా విజయవాడ కలెక్టరేట్లో ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు.బాధిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సందర్శించారు.బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లారు. కేంద్రం నుంచి తగినంత సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. అయితే రోజులు గడుస్తున్నా ఇంతవరకు వరద బాధితులకు సహాయం అందలేదు. దీంతో వారంతా ఆందోళనకు దిగుతున్నారు. తాజాగా వరద బాధితుల రాత్రి రహదారిపై ధర్నా చేశారు. దీంతో నగరంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చివరకు పోలీసులు అతి కష్టం మీద…
