తాజా వార్తలు

టెట్ పై మళ్లీ గందరగోళం

 సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ 2024) ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన తేదీలు కూడా ఇప్పటికే విద్యాశాఖ విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం మే 20 నుంచి జూన్‌ 3 వరకు టెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈసారి ఆన్‌లైన్‌ విధానంలో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ పేర్కొంది. ఇక జూన్‌ 12న టెట్‌ 2024 ఫలితాలు కూడా ప్రకటిస్తామని షెడ్యూల్‌లో పేర్కొంది. దీంతో నిరుద్యోగులు టెట్‌ ప్రిపరేషన్‌లో మునిగిపోయారు. అయితే సార్వత్రిక ఎన్నికల గండం గడిచినా.. మ్మెల్సీ ఉప ఎన్నిక ప్రభావం టెట్ పరీక్షపై పడుతుందేమోనని పలువురు ఆందోళన చెందుతున్నారు.ముఖ్యంగా రాష్ట్రంలోని నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ గురువారం (ఏప్రిల్‌ 25) విడుదలైంది.…

Read More
26 Apr 2024, 3:34 pmsiranews.in