Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 19 August 2024, 6:32 pmEditor : SIRA NEWS

Congress Aude Gajender : రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండ :బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్

సిరాన్యూస్‌, ఖానాపూర్
రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండ :బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్
మ‌ర్ల‌పెళ్లిలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని , రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్ , మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డిలు పేర్కొన్నారు సోమవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని మర్లపల్లి గ్రామంలో రుణమాఫీ అయినా రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అండగా రైతులతోపాటు ప్రజలందరూ నిలుస్తున్నారని, రుణమాఫీ ప్రక్రియను చూసి ఓర్వలేక కొంతమంది ప్రతిపక్షాల నాయకులు రైతులను రెచ్చగొడుతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత బి ఆర్ ఎస్ పార్టీ నాయకులకు, బీజేపీ నాయకులకు మతిస్థిమితం కోల్పోయిందన్నారు, కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గొర్ల రాజు యాదవ్‌, లాడే వారి దిగంబరప్ప , చట్ల ఉమేష్, లోలపు పోశెట్టి, సంజీవ్, బి రమేష్, లాడే వారి శివకుమార్, అనిల్ అప్ప, మాజీ ఉపసర్పంచ్ సాయన్న, రాజు రెడ్డి, నారాయణ, భోజన్న, శాకీర్ , పోతారెడ్డి, అరుణ్, పోశెట్టి, మహమూద్ యూసఫ్ తో పాటు రైతులు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.