
Congress came to power with fraudulent promises : కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారం లోకి వచ్చింది
హరీష్ రావు సిరా న్యూస్,హైదరాబాద్; బీఆర్ ఎస్ నాగర్ కర్నూలు పార్లమెంట్ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి టి .హరీష్ రావు పాల్గోన్నారు. హరీష్రావు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమీక్ష కు పెద్ద ఎత్తున హాజరైన మీ అందరికీ పేరు పేరున అభినందనలు. ఎన్నికల ఫలితాలు వచ్చి నేటికి 45 రోజులవుతోంది. ఓటమి నుంచి తేరుకుని నెల రోజులకే సమీక్ష ,సన్నాహక సమావేశాలు ప్రారంభించాం. ఇది పదకొండో మీటింగ్ ..ఇప్పటి దాకా జరిగిన అన్ని సమావేశాల్లో ఊహించిన దాని కన్నా ఎక్కువగా విలువైన సూచనలు వచ్చాయి. .కార్యకర్తలు ఏది కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో అదే జరుగుతుంది .పార్టీ మీ అభిప్రాయం మేరకే పని చేస్తుంది. తెలంగాణ అభివృద్ధి కోసం రేయింబవళ్లు తండ్లాడాం ..అయినా అసెంబ్లీ ఎన్నికల్లో తడబడ్డాం. మన పార్టీ స్థానం మారింది…
