తాజా వార్తలు

కాంగ్రెస్ పరాన్న జీవేనా

సిరా న్యూస్; హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి శరాఘాతంగా మారాయి. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఓ 30 పార్టీలతో జతకట్టి ‘ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ పేరుతో కూటమిని కట్టి భారతీయ జనతా పార్టీని కొంత మేర నిలువరించగలిగింది. అంతే తప్ప బీజేపీ సారథ్యంలోని ‘నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. పదేళ్లలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను చూస్తే బీజేపీతో ముఖాముఖి ఒంటరిగా తలపడ్డ అనేక సందర్భాల్లో ఓటమి పాలవుతూ వస్తోందని అర్థమవుతోంది.తాజాగా జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగా బీజేపీని ఢీకొట్టలేక హర్యానాలో చతికిలపడగా.. జమ్ము-కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ తో జతకట్టి గెలుపును సొంతం చేసుకుంది. ఇంకా లోతుగా వెళ్తే.. ఇక్కడ బీజేపీతో కాంగ్రెస్ నేరుగా తలపడ్డ చోట్ల కమలదళానిదే పైచేయి. కాంగ్రెస్…

Read More
10 Oct 2024, 10:59 amsiranews.in