Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 9 December 2023, 7:07 pmEditor : SIRA NEWS

Congress is the care of address for Development: తెలంగాణ ఇచ్చిన కాంగ్రేస్‌తోనే అభివృద్ధి..

సిరా న్యూస్, తలమడుగు:

తెలంగాణ ఇచ్చిన కాంగ్రేస్‌తోనే అభివృద్ధి..

– తలమడుగు జడ్పిటీసీ గోక గణేష్‌ రెడ్డి

తెలంగాణ ఇచ్చిన కాంగ్రేస్‌ పార్టీతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని తలమడుగు జడ్పిటీసీ గోక గణేష్‌ రెడ్డి అన్నారు. శనివారం ఆయన కాంగ్రేస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం సాయిలింగి గ్రామంలోని వృద్ధాశ్రమంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధుల చేత కేక్‌ కట్‌ చేయించారు. అనంతరం పండ్ల పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం ఖాయమని అన్నారు. అంతకు ముందు ఆయన ఆదిలాబాద్‌ పట్టణంలో జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, ఇతర నాయకులు ఉన్నారు.

 

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.